Bharat: ప్యాలెస్ కట్టే బదులు మెడికల్ కాలేజీ కట్టోచు

Bharat: ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా వైసీపీ నేతల వైఖరిలో మార్పు రాలేదని శ్రీభరత్ విమర్శించారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేయడంలో వైసీపీ నేతలు “పీహెచ్‌డీ చేశారని” ఆయన ఎద్దేవా చేశారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడులు రావడం జగన్ ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆరోపించారు.

పెట్టుబడుల సదస్సు సమయంలో వైసీపీ ర్యాలీలు చేపట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.“ర్యాలీల పేరుతో పెట్టుబడుల సదస్సును పక్కదోవ పట్టించాలనుకుంటే ప్రభుత్వం ఊరుకోదు” అని హెచ్చరించారు.

పెట్టుబడుల సదస్సు వివరాలు:

నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న ఈ సదస్సులో రూ. 9.8 లక్షల కోట్ల విలువైన 410కి పైగా ఒప్పందాలు (MoUs) కుదరనున్నాయని తెలిపారు.ఈ పెట్టుబడులతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.

వైసీపీ పాలనపై విమర్శలు:

రుషికొండ ప్రాజెక్టుపై వృధా ఖర్చు చేసిందని, అదే డబ్బుతో ఉత్తరాంధ్రలో మెడికల్ కళాశాలలు పూర్తి చేసి ఉండవచ్చని అన్నారు.

హత్యలు చేసిన వారికి మంత్రి పదవులు, అసభ్యంగా మాట్లాడిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జగన్ పాలన ప్రత్యేకతగా అభివర్ణించారు.గంజాయి కేసుల్లో ఉన్న వారిని పరామర్శించడం కూడా జగన్ పాలనలోనే సాధ్యమైందని ఎద్దేవా చేశారు.

కూటమి ప్రభుత్వ విజయాలు:

కూటమి ప్రభుత్వం 17 నెలల్లోనే రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదించిందని గుర్తుచేశారు.అభివృద్ధి, పరిశ్రమలు, యువత ఉపాధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శ్రీభరత్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *