Siva Shakthi Datta

Siva Shakthi Datta: కీర‌వాణి ఇంట తీవ్ర విషాదం..

Siva Shakthi Datta: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి, ప్రముఖ గేయ రచయిత, స్క్రీన్ రైటర్ శివశక్తి దత్త (92) మంగళవారం మరణించారు. హైదరాబాద్‌లోని మణికొండలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో శివశక్తి దత్త
శివశక్తి దత్త అసలు పేరు కోడూరి సుబ్బారావు. ఆయన అక్టోబర్ 8, 1932లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జన్మించారు. కళలపై చిన్ననాటి నుంచి ఆసక్తి ఉన్న ఆయన.. ముంబయికి వెళ్లి ఆర్ట్స్ కాలేజీలో చేరారు. కమలేశ్ అనే పేరుతో చిత్రకారుడిగా కూడా పనిచేశారు.

ఇది కూడా చదవండి: Simhachalam Temple: రేపే సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణ.. భయపడుతున్న భక్తులు

ఆ తర్వాత సంగీతంపై ఆసక్తితో గిటార్‌, సితార్‌, హార్మోనియం నేర్చుకున్నారు. టాలీవుడ్‌లో గేయ రచయితగా మంచి గుర్తింపు పొందిన ఆయన ఎన్నో హిట్ పాటలు రాశారు. స్క్రీన్ రైటర్‌గా కూడా పనిచేశారు.

అయన రచించిన హిట్ పాటలు
శివశక్తి దత్త రాసిన పాటలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి.

  • ‘సై’ సినిమాలో ‘నల్లా నల్లాని కళ్ళ’

  • ‘బాహుబలి’లో ‘సాహోరే బాహుబలి’, ‘మమతల తల్లి’

  • ‘ఆర్ఆర్ఆర్’లో ‘రామం రాఘవం’

  • ‘హనుమాన్’ సినిమాలో వచ్చిన థీమ్ సాంగ్
    వంటి ఎన్నో పాటలకు ఆయన అద్భుతమైన సాహిత్యం అందించారు.

కుటుంబ నేపథి
శివశక్తి దత్తకు ముగ్గురు పిల్లలు – సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్‌, రచయిత శివశ్రీ కంచి. ప్రముఖ కథా రచయిత వి. విజయేంద్ర ప్రసాద్‌ ఆయన తమ్ముడు కాగా, దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కి ఆయన పెదనాన్న.

సినీ ప్రపంచం శోకసంద్రం
శివశక్తి దత్త మరణంతో టాలీవుడ్‌ మొత్తం విషాదంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యుల ప్రకారం, ఆయన అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ మహా ప్రస్తానంలో జరగనున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *