MLC Kavitha:తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జనంబాట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తాత్కాలిక విరామం అనంతరం జనవరి 3, 4 తేదీల్లో ఆమె మళ్లీ జనంబాట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ సారి జనంబాట సూర్యాపేట జిల్లాలో చేపట్టనున్నట్టు ఆ సంఘం ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్లను విడుదల చేశారు.
MLC Kavitha:కవిత నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమం సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలో కొనసాగుతుందని తెలంగాణ జాగృతి నాయకులు తెలిపారు. తొలుత 3వ తేదీన ఆయా నియోజకవర్గాల్లో కవిత పర్యటన కొనసాగుతుంది. ఆ తర్వాత 4వ తేదీన కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో కొనసాగుతుందని సంఘం నాయకులు తెలిపారు.
MLC Kavitha:అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం, పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం, విద్యా, వైద్యం, ఆరోగ్యం వంటి ప్రధాన అంశాలను తీసుకొని కవిత ఈ పర్యటన కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆమె పోరాడుతున్నారు. అన్ని వర్గాలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కార మార్గాలను ప్రభుత్వాలకు సూచిస్తూ పర్యటన చేపడుతున్నారు.
MLC Kavitha:సూర్యాపేట జిల్లాలో కవిత చేపడుతున్న జనం బాట కార్యక్రమంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్నది. గతంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్‌రెడ్డిని కవిత చులకన చేస్తూ ఆరోపణలు చేశారు. లిల్లీపుట్ నాయకుడు అంటూ జగదీశ్‌రెడ్డిపై కవిత ఎద్దేవా చేశారు. దీనిపై ఆయన అంత సీరియస్‌గా తీసుకోకున్నా, బీఆర్ఎస్ క్యాడర్‌లో మాత్రం ఆమెపై ఆగ్రహం ఉన్నది. ఈ నేపథ్యంలో ఆమె జిల్లాలో పర్యటనపై ఉత్కంఠ నెలకొన్నది.
