Mlc kavita: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీల రాజకీయ హక్కుల కోసం పోరాటాన్ని ఉధృతం చేశారు. బంజారాహిల్స్‌లో 72 బీసీ కులాల నేతలతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 25 వేల మంది బీసీ ప్రజాప్రతినిధులు అయ్యేంతవరకూ తెలంగాణ జాగృతి ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.ఆ పదవుల్లో సగం మహిళలకే ఇవ్వాలని పేర్కొన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, సబ్‌కోటా ద్వారా అన్ని కులాలకు న్యాయం చేయాలని కోరారు.ఈ రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ అవసరమని, దీనిపై కేంద్రం తక్షణమే స్పందించాలని ఆమె సూచించారు.
రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన రిజర్వేషన్ తీర్మానం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉందని గుర్తు చేస్తూ, ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలపాలని జిష్ణదేవ్ వర్మను కోరారు.కోర్టుల్లో రిజర్వేషన్ విషయంలో వివాదం తలెత్తకుండా ప్రభుత్వం ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.