Telangana: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ప్రకటించింది.
ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ సీటును సీపీఐ పార్టీకి కేటాయించిన కాంగ్రెస్, మిగిలిన మూడు స్థానాల్లో సామాజిక సమతుల్యత పాటిస్తూ ఎంపిక చేసింది. ఇందులో ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక మహిళకు అవకాశం కల్పించింది.
అయితే, ఈ ఎంపికలో విజయశాంతి పేరు ఊహించని విధంగా తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఆమె గతంలో బీజేపీలో చేరి, ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమెకు అవకాశం ఇవ్వడం పార్టీలో కీలక పరిణామంగా భావిస్తున్నారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయంపై పార్టీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.