Vemula Veeresham: ఎడారి గా ఉన్న ప్రాంతాన్ని నీటి తో నింపి.. మాట నిలుపుకున్న ఎమ్మెల్యే తీరనున్న రైతుల, కష్టాలు హార్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపిన రైతులు నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం మహాలింగాల చెరువు జలకళ. ధర్మరెడ్డి కాలువ ద్వారా నింపిన సందర్భంగా గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధర్మరెడ్డి పిల్లాయిపల్లి కాలువల రాకతో రామన్నపేట, చిట్యాల, నార్కెట్‌పల్లి మండలాల దాహార్తి తీరుతుంది. శివనేనిగూడెం ప్రజల 6, 7″సంవత్సరాల కల నేరవేరింది గత ఐదు సంవత్సరాల్లో ఈ చెరువు వైపు చూసిన నాధుడే లేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతో ఈ చెరువులు ఇప్పుడు నింపుతున్నాం. గత పాలనలో ఈ ప్రాంతన్ని ఎండబెట్టారు. ఇక్కడ ఉన్న నాయకులు రైతుల, సహకారంతో 3 నెలల ప్రయత్నంలో బాగంగా ఈ చెరువులు నింపుతున్నాం. మూసీ ని మా ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుంటే ప్రతిపక్షలకు ఎందుకు నొప్పి పుడుతుంది? నకిరేకల్ నియోజకవర్గంలో 80% ప్రజలు మూసి నీరు పై ఆధారపడి బ్రతుకుతున్నారు.
మూసీ నది ప్రక్షాళన చేస్తూ అత్యధికంగా బాగుపడేది మనమే. కావున మూసీ ప్రక్షాళనకు మనందరం ఎక్కువ మద్దత్తు నిలువాలి మూసి ప్రక్షాళన అడ్డుకుంటున్న నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఊళ్ళల్లో ఎలా తీరుగుతారో ప్రజల చూసుకుంటారు.
వాళ్ల మనస్సులు మారకపోతే ప్రజలే వాళ్లకు బుద్ది చెబుతారు నల్గొండ జిల్లా ప్రజలకు సాగు నీరు త్రాగు నీరు అందిస్తాం అంటే వాళ్ళు అడ్డుకోవటం పూర్తిగా తప్పు నల్గొండ జిల్లా ప్రజలకు శాశ్వతంగా సాగు. త్రాగు నీరు ఇబ్బందులు ఉండవద్దు అనేదే మా ప్రభుత్వం లక్ష్యం గత ప్రభుత్వంలో మా నియెజకవర్గంకు సంబందించిన బ్రహ్మాణవెల్లంల, అయిటిపాముల లిఫ్ట్ లో సహా ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకు నయా పైసా కేటాయింపులు లేవు ఇప్పుడు పిలాయి పల్లి, ధర్మారెడ్డి పూర్తి చేసుకున్నట్టు రేపు, బ్రాహ్మణ వెళ్ళాంల, అయిటిపాముల లిఫ్ట్ కూడా త్వరగా పూర్తి చేసుకుందాం అన్నారు.

