MLA Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని అఘాపురాలో ఓ చోట ఏర్పాటు చేసిన వినాయక విగ్రహంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఆ విగ్రహం సీఎం రేవంత్‌రెడ్డిని పోలి ఉన్నదని తెలిపారు. దానిని చూసేందుకు భక్తులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు.
MLA Raja Singh: ఈ నేపథ్యంలో ఆ విగ్రహంపై ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి దేవుడు కాదు కదా? అని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై గౌరవంతో నిర్వాహకులు ఏర్పాటు చేసినా ఆయన తమకు దేవుడు కాడని తేల్చి చెప్పారు. వెంటనే ఆ మండపాన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు.
MLA Raja Singh: ఇలాంటి చర్యలు హిందూ సమాజం యొక్క మనోభావాలను దెబ్బతీస్తాయని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా మత విశ్వాసాలను గౌరవించాలని హితవు పలికారు. ఎవరు చేసినా తప్పేనని తెలిపారు.