MLA Raj Thakur: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసిన మరునాడే రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ చేసిన కీలక వ్యాఖ్యలు కలకలం రేపాయి. సరస్వతీ పుష్కరాల సమయంలో ప్రొటోకాల్ పాటించలేదంటూ ఎంపీ వంశీకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. దళిత సంఘాలు కూడా ఆయనకు ప్రొటోకాల్ ఇవ్వకపోవడంపై ఆందోళనలు నిర్వహించాయి.
MLA Raj Thakur: ప్రొటోకాల్ విషయంపై మంత్రి మాట్లాడుతూ.. వేరే పార్టీలోకి వెళ్తారనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ పరోక్షంగా ఎంపీ వంశీకృష్ణపై వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై తాజాగా ఎమ్మెల్యే రాజ్‌ఠాగూర్ మాట్లాడారు. వంశీ చిన్నపిల్లవాడని, ఆయనకు చాలా భవిష్యత్తు ఉన్నదని పేర్కొన్నారు. అనవసర విషయాలపై ఆయన మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుందని సూచించారు.
MLA Raj Thakur: సరస్వతీ పుష్కరాలలో ఎలాంటి ప్రొటోకాల్ ఉల్లంఘన జరగలేదని ఒకరిని చిన్నచూపు చూపారనేది అవాస్తవమని ఎమ్మెల్యే రాజ్‌ఠాగూర్ వ్యాఖ్యానించారు. అసలు ప్రొటోకాల్ ఇవ్వలేదని చెప్పడం వెనుక వేరే మర్మం ఉన్నదని ఆరోపించారు. 15 రోజులు తర్వాత ఆ మర్మమేమిటో అందరికీ తెలుస్తుందని చెప్పారు. రాష్ట్రస్థాయి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, ఎంపీల ఫొటోలు వేయరని రాజ్‌ఠాగూర్ పేర్కొన్నారు.

