Ap news: రాయలసీమలో ఉద్రిక్తత నెలకొంది.జమ్మలమడుగు నియోజకవర్గంలో కొండాపురం రాగికుంట గ్రామం వద్ద అదానీ విద్యుత్ ప్లాంట్ల నిర్మిస్తుంది. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులు అదానీ సంస్థ క్యాంపు కార్యాలయం..సిబ్బందిపై దాడికి దిగారు. ఆదానీ సిబ్బంది పై దాడి ఘటన రాయలసీమ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచింది.
ఈ ఘటనపై అదాని గ్రూప్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. దాడికి పాల్పడిన వారి పైన ఆదానీ సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. అదానీ పలుకుబడి ఉపయోగించి ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి.
ఘటనపై ఎమ్మెల్యే ఆదినారాయణ స్పందిస్తూ.. సంస్థలో తమ వాహనాలను అద్దెకు పెట్టుకోవాలని..తమ వారికి ఉద్యోగాలు ఇవ్వాలని మాత్రమే తమ వాళ్లు అడిగారని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఆదానీ సంస్థ వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం రాగికుంట గ్రామం వద్ద 470 ఎకరాల విస్తీర్ణంలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. అక్కడ నేల చదును ప్రారంభించింది. ఈ సమయంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైన శివనారాయణ రెడ్డి, రాజేష్‌రెడ్డి తమ అనుచరులతో కలిసి అక్కడ అదానీ సంస్థ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. వాగ్వాదం పెరిగి క్యాంపు కార్యాలయం.. సిబ్బంది పైన దాడికి దిగారు.