Adinarayana Reddy: కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని మైలవరం మండలంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి,టిడిపి ఇన్చార్జ్ భూపేష్ రెడ్డి పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదినారాయణ రెడ్డి మరియు భూపేష్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. గత పాలకులు జమ్మలమడుగును నిర్లక్ష్యం చేశారని కూటమి ప్రభుత్వం ఏర్పడిన 120 రోజుల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు జరగడం ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఇకపై జమ్మలమడుగు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను ఉరకలెత్తిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ భూపేష్ సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల ఆదేశాల మేరకు పది రోజులపాటు పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

