Mk Stalin: కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ప్రయత్నిస్తున్న త్రిభాషా సిద్ధాంతంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. దేశంలోని కొత్త జాతీయ విద్యావిధానం (NEP) అమలును తమిళనాడులో అనుమతించబోమని స్పష్టం చేశారు.
తమిళనాడులో అమలు కాదు
స్టాలిన్ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధానాన్ని తిరస్కరిస్తూ, తమిళనాడు ప్రత్యేకతను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు. “నాగ్‌పూర్ (RSS ప్రధాన కార్యాలయం) నుంచి వచ్చే ఆదేశాలను తమిళనాడులో అమలు చేయబోం” అని స్పష్టం చేశారు.
RSS స్కీం అని ఆరోపణ
స్టాలిన్ మాట్లాడుతూ, త్రిభాషా విధానం పూర్తిగా RSS ఆలోచనల ప్రకారమే రూపొందించబడిందని ఆరోపించారు. విద్యావ్యవస్థకు మతపరమైన రంగు అద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తెరపైకి తెచ్చిందని అన్నారు.
DMK పోరాటం
త్రిభాషా విధానం అమలుపై తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారని స్టాలిన్ చెప్పారు. తమిళ భాషా గౌరవాన్ని కాపాడేందుకు, విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా కొనసాగించేందుకు అన్ని విధాలా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.
తమిళనాడు వైఖరి స్పష్టంగా
తమిళనాడు విద్యావ్యవస్థలో తాము ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటామని, హిందీని బలవంతంగా నెట్టి తెచ్చే ఎలాంటి ప్రయత్నాన్నీ సహించబోమని సీఎం స్టాలిన్‌తేల్చిచెప్పారు.

