హైదరాబాద్‌లోని మియాపూర్ లో చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.శుక్రవారం రాత్రి ఓ అపార్ట్‌మెంట్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో చిరుత సంచరించడం కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులతో కలిసి ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు చిరుత కోసం తీవ్రంగా గాలించారు.
ఎక్కడా చిరుత పాదముద్రల ఆనవాళ్లు కనిపించలేదు. దాంతో ఇవాళ ఉదయం అధికారులు అపార్ట్‌మెంట్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అది అడవి పిల్లి అని అటవీశాఖ అధికారులు తేల్చారు. దాంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.