Mitra Mandali: టాలీవుడ్ కామెడీ చిత్రం ‘మిత్ర మండలి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రియదర్శి, రాగ మయూర్ నటించిన సినిమా. రీసెంట్గా టాలీవుడ్లో రిలీజ్ అయిన కామెడీ చిత్రం ‘మిత్ర మండలి’. ప్రియదర్శి, రాగ మయూర్, విష్ణు, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో నటించారు. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రాన్ని విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించారు. థియేటర్స్లో అనుకున్న సక్సెస్ సాధించలేకపోయినా, ఇప్పుడు ఓటీటీలో అవకాశం దక్కింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్ర హక్కులు సొంతం చేసుకుంది. నవంబర్ 6 నుంచి అంటే రేపటి నుంచి సినిమా స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది. తెలుగు భాషలో మాత్రమే ఈ చిత్రం అందుబాటులోకి వస్తుంది. నిహారిక ఎన్ ఎం హీరోయిన్గా నటించగా, బన్నీ వాసు సమర్పణలో ఈ చిత్రం విడుదలైంది. ఓటీటీలో ఈ కామెడీ ఎంటర్టైనర్ ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.

