Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ విజయవాడలోని సిట్ కార్యాలయానికి హాజరయ్యారు. ఆయనతో పాటు వ్యక్తిగత న్యాయవాదులు కూడా విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో ఆయనకు కీలకమైన ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఈ కేసులో అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ప్రధానంగా విచారణలో నిలిచింది. ఈ సంస్థ వెనుక మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి ఉన్నారని రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల చేసిన బహిరంగ వ్యాఖ్యలు ఈ వ్యవహారాన్ని మరింత చర్చనీయాంశంగా మార్చాయి. ఆయన శుక్రవారం సిట్‌కు వాంగ్మూలం ఇచ్చారు. అదే నేపథ్యంలో మిథున్ రెడ్డిని విచారించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Also Read: Hydra: ఏపీ టీడీపీ ఎమ్మెల్యే కట్టడాలు కూల్చివేసిన హైడ్రా
Mithun Reddy: విచారణ సమయంలో మిథున్ రెడ్డి వెంట సిట్ కార్యాలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. విజయసాయి రెడ్డి తమ పార్టీలో లేకుండా వెళ్లిన వ్యక్తి అని, ఆయన టీడీపీ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారని విమర్శించారు. జగన్ సన్నిహితులను లక్ష్యంగా చేసుకునే కుట్ర ప్రకారం సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారని ఆయన అన్నారు.
ఈ కేసు వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకుండా, కూటమి ప్రభుత్వం హయాంలో ప్రారంభమైందని, దర్యాప్తు పేరుతో రాజకీయ వేధింపులు జరుగుతున్నాయని కోరుముట్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంపై నిజమైన విచారణ జరగాలంటే అన్ని పార్టీలతోపాటు ప్రభుత్వాలపై సమానంగా దృష్టి పెట్టాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి :