Midhun Reddy: సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన ఎంపీ మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ కేసు విచారించిన ఏసీబీ కోర్టు, బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.
అదే కేసులో నిందితుడిగా ఉన్న చాణక్య బెయిల్ పిటిషన్‌పై విచారణ కూడా ఈ నెల 11వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో సీజ్ చేసిన రూ. 11 కోట్ల వ్యవహారంపై కూడా కోర్టులో విచారణ జరిగింది.
మరోవైపు, నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ మొదలైంది. ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో, నిన్ననే ముగ్గురు నిందితులు జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తదుపరి విచారణలో కీలక అంశాలు వెలువడే అవకాశం ఉంది. కేసు విచారణను ఏసీబీ కోర్టు, హైకోర్టులు వేర్వేరుగా విచారిస్తున్నాయి.

