Mitchell Starc

Mitchell Starc: నీ గురించి గర్వపడుతున్నా.. మిచెల్ స్టార్క్ ఎమోషనల్ పోస్ట్

Mitchell Starc: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ దిగ్గజం, కెప్టెన్ అలిస్సా హీలీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తరుణంలో, ఆమె భర్త, స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు హీలీ ప్రకటించిన వెంటనే, స్టార్క్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆమె ఫోటోను షేర్ చేస్తూ.. “నీ గురించి గర్వపడుతున్నాను అని మూడు ముక్కల్లో తన ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నారు. ఫిబ్రవరి,మార్చి నెలల్లో భారత్‌తో జరగనున్న స్వదేశీ సిరీస్ అలిస్సా హీలీకి చివరిది. జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని,

ఇది కూడా చదవండి: Amitov Teja: దర్శకుడు తేజ కుమారుడికి టోకరా.. రూ. 63 లక్షలు గోవిందా !

ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు యువ ఆటగాళ్లను సిద్ధం చేసేందుకు ఆమె భారత్‌తో జరిగే టీ20 సిరీస్ నుండి తప్పుకున్నారు. నేరుగా వన్డే, టెస్టు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాకు సారథ్యం వహించి రిటైర్ అవుతారు. హీలీ తన కెరీర్‌లో ఏకంగా 8 ప్రపంచకప్ టైటిళ్లను (6 టీ20, 2 వన్డే) గెలుచుకుంది. ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడవ మహిళా క్రికెటర్‌గా (7,106 పరుగులు) ఆమె రికార్డు సృష్టించారు. గత కొంతకాలంగా గాయాలతో పోరాడుతున్న ఆమె, మానసికంగా కొంత అలసిపోయానని, గతంలో ఉన్నంత పోటీ తత్వం ఇప్పుడు తనలో లేదని అందుకే రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు వెల్లడించారు.కాగా మిచెల్ స్టార్క్, అలిస్సా హీలీ 2016లో వివాహం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *