Miss World Competitions: హైదరాబాద్ నగరం త్వరలో మరో అంతర్జాతీయ పోటీలకు వేదిక కానున్నది. ఈ-కార్ రేసింగ్ పోటీలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించి గుర్తింపు పొందిన మన నగరం మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు సిద్ధంగా ఉన్నది. ఈ పోటీలతో మరోసారి ప్రపంచస్థాయి నగరాలతో పోటీపడినట్టయింది. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రోపాలిటన్ సిటీగా హైదరాబాద్ గుర్తింపును తెచ్చుకున్నది. ఈ మేరకు ఇలాంటి పోటీలు ఈ నగరానికి మరింత వన్నె తేనున్నాయి.
Miss World Competitions: హైదరాబాద్ నగరంలో మే నెల 7వ తేదీ నుంచి అదే నెల 31వ తేదీ వరకు మిస్‌వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఇంతకు ముందు 71వ సారి పోటీలు జరిగాయి. 72వ పోటీలకు నగరం వేదిక కానున్నది. ఆయా తేదీల్లో హైదరాబాద్ నగరంలో వరల్డ్ పోటీల ఆరంభం, ముగింపు, గ్రాండ్ ఫినాలే కార్యక్రమాలు జరుగుతాయి.
Miss World Competitions: రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలైన యాదగిరిగుట్ట, రామప్ప, లక్నవరం, అనంతగిరి ప్రాంతాల్లో మిస్ వరల్డ్ పోటీలను ఏర్పాటు చేయనున్నారు. మన పర్యాటక రంగం ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందేందుకే ఆయా కేంద్రాల్లో ఈ పోటీలను నిర్వహించాలని నిర్ణయించారు. పర్యాటక ఆయా కార్యక్రమాలను నిర్వహించే బాధ్యతను వహిస్తున్నట్టు తెలుస్తున్నది.
Miss World Competitions: హైదరాబాద్ నగరంలో జరగనున్న 72వ మిస్‌వరల్డ్ పోటీలకు ప్రపంచంలోని 120 దేశాల యువతులు పాల్గొని అలరించనున్నారు. ఈ కార్యక్రమంలో 17 ఏండ్ల వయసు నుంచి 27 ఏండ్ళ వయసు మధ్య యువతులు పాల్గొనేందుకు అర్హులు. వారికి ఎలాంటి నేరాలపై కేసులు ఉండరాదు. ఏదేశంలో పుడితే ఆదేశం నుంచి మాత్రమే ప్రాతినిధ్యం ఉంటుంది. విజేతగా నిలిచి యువతికి వజ్రాల కిరీటం అందజేస్తారు.