Miss World 2025: మిస్‌వరల్డ్-2025 అందాల పోటీల కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన అందాల భామలను గ్రూపులుగా విభజించి రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు నిర్వాహకులు తీసుకెళ్తున్నారు. తొలి రోజైన సోమవారం (మే 12న) తొలి బృందాన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌కు తీసుకెళ్తున్నారు.
Miss World 2025: నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిసరాలతో పాటు బుద్ధవనాన్ని కంటెస్టెంట్లకు చూపించనున్నారు. ఇదే రోజు బుద్ధపూర్ణిమ కావడంతో అక్కడ జరిగే కార్యక్రమాల్లో వారంతా పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. వారి కోసం పోలీస్ శాఖ పటిష్ఠ భద్రతను కట్టుదిట్టం చేసింది.
Miss World 2025: తొలుత వాటర్ బ్యాక్‌గ్రౌండ్, ప్రవేశ ద్వారం వద్ద అందాల భామలతో ఫొటో సెషన్ ఉంటుంది. ఆ తర్వాత ఆ బృందం బుద్ధవనం చేరుకుంటుంది. అక్కడి బుద్ధుడి పాదాల చెంత వారంతా పుష్పాంజలి ఘటిస్తారు. తొలుత వారికి బుద్ధవనంలో సంప్రదాయ నృత్యంతో ఘనంగా స్వాగతం పలుకుతారు.
Miss World 2025: ఆసియా దేశాల నుంచి పోటీల్లో పాల్గొంటున్న 24 మందితో కూడిన కంటెస్టెంట్ల గ్రూపు సాగర్‌ను సందర్శించనున్నది. ఈ బృందం హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి చింతపల్లి సమీపంలోని వెల్లెంకి గెస్ట్‌హౌజ్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి నాగార్జున సాగర్‌లోని విజయవిహార్‌కు వెళ్తుంది.
Miss World 2025: పర్యాటక ప్రాంతాల సందర్శనలో భాగంగా రేపు (మే 13న) చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్లు హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. చార్మినార్ నుంచి చౌమహల్లా ప్యాలెస్ వరకూ ఈ వాక్ కొనసాగుతుంది. ఈ మేరకు అక్కడ వారంతా షాపింగ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ఇప్పటికే అందంగా తీర్చిదిద్దారు.