Miss World 2025: హైదరాబాద్ మహానగరం 72వ మిస్ వరల్డ్ పోటీలకు ముస్తాబైంది. మే 10 నుంచి ఇదేనెల 31 వరకు ఈ పోటీలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లను చేసింది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకుంటున్నారు. తెలంగాణ పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా, తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా ఈ పోటీలను నిర్వహించేందుకు సిద్ధమైంది.
Miss World 2025: హైదరాబాద్ లో మే 10 నుంచి జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు 120 దేశాల నుంచి అందాల భామలు పోటీ పడుతున్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మే 10న శనివారం సాయంత్రం 6.30 గంటలకు ఈ పోటీలు ప్రాంరభంకానున్నాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పోటీల వీక్షణకు సామాన్య ప్రజలకు కూడా అవకాశం కల్పించడం విశేషం.
Miss World 2025: ప్రారంభోత్సవ వేడుకల్లో 120 దేశాల అందాల యువతులు తమ దేశాల జెండాలతో పరేడ్ నిర్వహించనున్నారు. ఇదే వేదికపై తెలంగాణ ప్రత్యేకమైన పేరిణి, గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ఉంటాయి. ప్రారంభ వేడుకల్లో సుమారు 3,000 మంది హాజరవుతారని అంచనా. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభ వేడుకలు జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు.
Miss World 2025: తెలంగాణలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి చాటి చెప్పే ఉద్దేశంతో మిస్‌వరల్డ్ పోటీదారులకు చూపించనున్నారు. ఆయా ప్రాంతాల్లో వారు సందర్శించేలా ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేశారు. ముఖ్యంగా నాగార్జున సాగర్, బుద్ధవనం, వరంగల్ కోట, రామప్ప ఆలయం, వేయి స్తంభాల గుడి, యాదగిరిగుట్టను వారు సందర్శించేలా ఏర్పాట్లు చేశారు.
ఇదిలా ఉండగా, భారత్, పాక్ ఉద్రిక్త పరిస్థితుల నడుమ అందాల పోటీల నిర్వహణను వాయిదా వేయాలని వివిధ వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అయినా ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసిన కారణంగానో ఏమో కానీ, నిర్వహణకే మొగ్గు చూపుతున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని ఆంక్షలు ఉండటంతో కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.