Miss & MRS Telugu USA 2025: MBartstudio సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా మిస్ తెలుగు యూఎస్‌ఎ పోటీలను నిర్వహిస్తోంది. గతంలోనూ ఈ సంస్థ మిస్ తెలుగు కెనడా పోటీలను నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా తమ ప్రత్యేకతను చాటుకుంది. ఈ ఏడాది కూడా మరోసారి మిస్ తెలుగు యూఎస్‌ఎ పోటీలను నిర్వహిస్తోంది. అమెరికాలో స్థిరపడిన తెలుగు మహిళల ప్రతిభను, మేధస్సును, నాయకత్వ లక్షణాలను అంతర్జాతీయ స్థాయిలో వెలుగులోకి తెచ్చేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఇది కేవలం ఒక అందాల పోటీ మాత్రమే కాదు.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ, తమ సత్తా ప్రపంచ వ్యాప్తంగా చాటాలనుకునే మహిళలకు ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని నిర్వహకులు తెలిపారు.
ఇదిలా ఉంటే మిస్ తెలుగు యూఎస్‌ఎ పోటీకి ఇప్పటికే అపూర్వ స్పందన లభించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇటీవలే పూర్తవగా 200కి పైగా దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు మహిళల నుంచి ఇంతటి ఆసక్తి కనిపించడం ఈ పోటీ ప్రాముఖ్యతను స్పష్టం చేస్తోంది. ఆన్‌లైన్ స్క్రీనింగ్, గ్రూప్ స్థాయి ఆడిషన్‌లు నిర్వహించి, ప్రతి కేటగిరీ నుండి టాప్ 23 మంది పోటీదారులను ఎంపిక చేసి గ్రాండ్ ఫినాలేకు సెలక్ట్ చేశారు. ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం నిష్పక్షపాతంగా జరగడం వల్ల నిజమైన ప్రతిభ ఉన్నవారికే ఈ వేదికపై నిలిచే అవకాశం లభించింది.
మిస్ అండ్ మిస్టర్ తెలుగు యూఎస్‌ఎ అనేది అమెరికాలో తెలుగు మహిళల కోసం నిర్వహించబడే అతిపెద్ద, అత్యంత గౌరవనీయమైన బ్యూటీ పేజెంట్. ఈ వేదిక అందాన్ని కొత్తగా నిర్వచిస్తూ, వ్యక్తిత్వాన్ని ప్రోత్సహిస్తూ, వ్యక్తిగత ఎదుగుదలకు తోడ్పడుతూ, కమ్యూనిటీతో అనుసంధానాన్ని పెంపొందిస్తోంది. విజేతలకు ఏకంగా 4 అంతర్జాతీయ బ్యూటీ పేజెంట్లలో నేరుగా పాల్గొనే అవకాశం లభించడం ఈ పోటీ యొక్క ముఖ్య ఉద్దేశం కాగా.. ప్రతి కేటగిరీలో 9 టైటిల్స్ ఉంటాయి. భారత మూలాలను గౌరవించడంతో పాటు అమెరికాలో మన తెలుగు సంప్రదాయాలు, సంస్కృతి ఔన్నత్యాన్ని ఘనంగా చాటిచెప్పడమే ఈ వేడుక ప్రధాన లక్ష్యం.ఇదిలా ఉంటే మే25వ తేదీన జరిగే మిస్ తెలుగు యూఎస్‌ఎ గ్రాండ్ ఫినాలే పేజెంట్‌కు అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు నిర్వహకులు.