Miss Telugu USA: అమెరికాలో తెలుగు మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా వారిలో ప్రతిభను వెలుగులోకి తేవడానికి ఎప్పటికప్పడు పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్న MBartstudio ఇప్పుడు మరో ఆసక్తికర కార్యక్రమంతో ముందుకు వచ్చింది. ప్రొఫెషనల్ గా గౌరవప్రదంగా Miss Telugu USA పోటీలను నిర్వహిస్తోంది. గతంలో MBartstudio – Miss Telugu Canada పోటీలను నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేకతను చాటుకున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు మళ్ళీ అదే విధంగా Miss Telugu USA పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీలకు పూర్తి ప్రొఫెషనల్ గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిపారు. దీనికి అపూర్వమైన స్పందన వచ్చింది. రిజిస్ట్రేషన్ కోసం 200కు పైగా అప్లికేషన్లు వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. తెలుగు మహిళలు నుంచి ఇంత ఆసక్తి కనిపించడం పోటీ ప్రాధాన్యతను మరింత పెంచిందని వారన్నారు.
ఆన్‌లైన్ స్క్రీనింగ్, గ్రూప్ స్థాయిలో ఆడిషన్‌లు నిర్వహించి, ప్రతి కేటగిరీ నుండి టాప్ 23 మంది పోటీదారులను ఎంపిక చేసి, గ్రాండ్ ఫినాలేకు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఈ ప్రాసెస్ మొత్తం నిష్పక్షపాతంగా, నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చేలా జరగడం వల్ల, నిజమైన ప్రతిభ ఉన్నవారికి ఈ వేదిక మీద నిలిచే అవకాశం లభించిందని MBartstudio నిర్వాహకులు చెబుతున్నారు.
అమెరికాలోని తెలుగు మహిళలకు తమ ప్రతిభ, మేధస్సు, నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఒక వేదిక కల్పించడం.. తమ మూలాలను గౌరవిస్తూ, అద్భుత స్థాయి సాధించే నాయకులను తయారుచేయడం.. అమెరికాలో మన తెలుగు సంప్రదాయాల ఔన్నత్యాన్ని, సంస్కృతిని ఘనంగా వేడుక చేసుకోవడం లక్ష్యంగా ఈ పోటీలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
ఇక మిస్ తెలుగు యూఎస్ పోటీల గ్రాండ్ ఫినాలే మే 25న నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. డల్లాస్ లోని ఇర్వింగ్ ఆర్ట్స్ సెంటర్ లో నిర్వహించే ఈ ఈవెంట్ లో ప్రముఖ తెలుగు సినీ గాయని గీతామాధురి సెలబ్రిటీ జడ్జిగా వ్యవహరిస్తారని చెప్పారు. ఈ ఈవెంట్ కు మీడియా పార్ట్నర్ గా మహా న్యూస్ వ్యవహరిస్తోంది. ఈ మిస్ తెలుగు యూఎస్ పోటీల్లో ప్రతి కేటగిరీల్లోనూ 9 టైటిల్స్ ఉంటాయనీ.. టైటిల్ విజేతలకు ఎంతో ప్రతిష్టాత్మకమైన నాలుగు బ్యూటీ పేజెంట్లలో నేరుగా పాల్గొనే అవకాశాన్ని Miss Telugu USA అందిస్తోందని నిర్వాహకులు తెలిపారు.