Cow Calf: అన్నమయ్య జిల్లాలో దారుణం.. ఆవు దూడపై మైనర్ల అఘాయిత్యం..!

Cow Calf: అన్నమయ్య జిల్లా కురబలకోటలో మానవత్వం సిగ్గుతో తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మనం దేవతగా పూజించే గోమాతపై మైనర్లు అఘాయిత్యానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సుమారు ఆరు రోజుల క్రితం జరిగిన ఈ ఘోరం, సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఆలస్యంగా బయటపడింది.

ముక్కలచెరువు మండలం బురకాయలకోట గ్రామానికి చెందిన నలుగురు మైనర్లు ఒక ఆవు దూడను ఊరి చివరకు తీసుకెళ్లారు. అక్కడ ఒక బాలుడు ఆ మూగజీవిపై అఘాయిత్యానికి పాల్పడగా, మరో బాలుడు ఆ నీచమైన పనిని తన ఫోన్‌లో వీడియో తీశాడు. మిగిలిన ఇద్దరు మైనర్లు వారికి సహకరించారు. అంతటితో ఆగకుండా, ఆ వీడియోను తమ స్నేహితులకు పంపడంతో అది కాస్తా ఊరంతా వ్యాపించి వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: Bollywood: బాలీవుడ్ స్టార్ పై 13 కోట్ల చీటింగ్ కేసు..

ఈ విషయం తెలిసిన గ్రామస్థులు మరియు హిందూ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ శుక్రవారం నాడు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని ములకలచెరువు పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నోరులేని మూగజీవుల పట్ల మైనర్లు ఇంత క్రూరంగా ప్రవర్తించడం చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. మనుషులకే కాదు, చివరికి పశువులకు కూడా రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *