Telangana: పార్టీ హైకమాండ్ చాలా సీరియస్‌గా ఉన్నది. ఈ విషయం నీకూ తెలుసు. నీ వల్ల జాతీయస్థాయిలో పార్టీ పరువు పోయింది. ఇక నా చేతిలో ఏమీ లేదు. అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం.. అని మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించినట్టు విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లే ముందు మంత్రి కొండా సురేఖతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. వరుస వివాదాల నేపథ్యంలో ఆమెతో రేవంత్‌రెడ్డి చర్చించారని తెలిసింది.
Telangana: మంత్రి కొండా సురేఖ వివాదాలపై ఇప్పటికే పార్టీ అధిష్ఠానం సూచన మేరకు మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో చర్చించినట్టు సమాచారం. వారిచ్చిన సమాచారంపైనా సీఎం ఆమెతో డిస్కషన్ చేసినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో వ్యతిరేకంగా ఉన్నారని పొంగులేటి భేటీలో తేలిందని చర్చ జరుగుతున్నది. సీఎం సీడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్తున్నా, రాష్ట్రంలోని ప్రధాన విషయాలపై ఆ పార్టీ అధిష్ఠానం పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నది.
Telangana: రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పుల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖతో ముఖ్యమంత్రి భేటీ కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. పలు వివాదాలపై ఆమెపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డట్టు తెలిసింది. ఏది ఏమైనా మంత్రి పదవి ఉన్నా, ఊడినా దిటవుగా ఉండాలనే ఇలా చెప్పారా? అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వరుస వివాదాలు, ఎమ్మెల్యేల వ్యతిరేకత, ఆమె వర్గ నేతల వైఖరి ఇలా పలు విషయాల్లో పార్టీకి చేటు తెచ్చినట్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. సీఎం వచ్చేనాటికా ఆమె పదవి ఉండేనా, ఊడేనా? తేలిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వస్తున్నారు.