minister seetakka: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని సహించబోమని మంత్రి సీతక్క హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని బత్తులపల్లిలో పర్యటించిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పాలనలో స్కీముల పేరిట స్కామ్‌లు జరిగాయని మండిపడ్డారు. ముఖ్యంగా గొర్రెల పంపిణీ పథకం కింద పేదల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన వారిని ముక్కుపిండి వసూలు చేస్తామని స్పష్టం చేశారు.
గొర్రెల పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా, వినూత్నంగా అమలు చేస్తుందని తెలిపారు. అంతేకాక, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి విదేశీ సందర్శకులను ఆహ్వానిస్తామని చెప్పారు.
ఇక గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన మొయినుద్దీన్ ఇంటిపై సోదాలు నిర్వహించిన అధికారులు, అతడి ఖాతాల నుంచి భార్య అకౌంట్‌కు డబ్బు బదిలీ అయిన ఆధారాలు గుర్తించారు. మొయినుద్దీన్‌తో పాటు అతని కుమారుడు ఇక్రముద్దీన్ ఈ స్కాంలో కీలక పాత్ర పోషించినట్టు వెల్లడైంది. ప్రస్తుతం వీరిద్దరూ పరారీలో ఉండగా, వారి కోసం లుక్‌ఔట్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

