Seetakka: అల్లు అర్జున్ అరెస్ట్ పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

Seetakka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.అల్లు అర్జున్ అరెస్ట్ చట్ట ప్రకారమే జరిగిందని అన్నారు. ఆయనపై ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదని.. చట్టం ఎవరికీ చుట్టం కాదని అన్నారు సీతక్క. అల్లు అర్జున్ అరెస్ట్ వెనక ప్రభుత్వ హస్తం ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న క్రమంలో మంత్రి సీతక్క కామెంట్స్ కీలకంగా మారాయి.

కాగా, బన్నీ ఇవాళ ఉదయం జైలు నుంచి విడుదల అయ్యారు. జైలు నుంచి విడుదలైన బన్నీని పరామర్శించేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలంతా క్యూ కట్టారు. అల్లు అర్జున్ ని కలిసి పరామర్శించిన వారిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు, డైరెక్టర్ హరీష్ శంకర్, హీరో రానా, ఆర్‌, నారాయణ మూర్తి, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, డైరెక్టర్ కొరటాల శివ తదితరులు ఉన్నారు.

నిన్న జరిగిన సన్నివేశాలు పరిశీలిస్తే..

డిసెంబర్ 13న 11:45AM – అల్లు అర్జున్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఇంటికి వెళ్లారు.

12:00PM – అరెస్టు చేస్తున్నామని అల్లు అర్జున్‌కు పోలీసులు తెలిపారు.

12:00PM – అయితే బెడ్రూంలోకి వెల్లిన పోలీసులపై బన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

12:15PM- అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు.

12:20PM- జూబ్లిహిల్స్ నివాసం నుంచి అల్లు అర్జున్‌ను తరలించారు.

1:00PM – చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్‌ను తరలించారు.

1:15PM- అరెస్టుపై పోలీసులు రిమాండ్ రిపోర్టు రెడీ చేశారు.

1:30PM – చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బన్నీ అభిమానులు భారీగా చేరుకున్నారు.

1:50pm కి చిరంజీవి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నాడు.

1:45PM- అరంతరం హైకోర్టులో లంచ్ మోషన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

2.00PM- ఆపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు డైరెక్టర్లు, నిర్మాతలు చేరుకున్నారు.

2:05PM గంటలకు పోలీసు వాహనాలు సిద్ధం చేశారు.

2:10 PM గంటలకు అల్లు అర్జున్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

2:35PM గంటలకు గాంధీ అసుపత్రిలో బన్నీకి వైద్యపరీక్షలు నిర్వహించారు.

3:15PM గంటలకు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ తరలించారు.

3.20PM గంటలకు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌ను పోలీసులు హాజరుపరిచారు.

3:30PM గంటలకు అల్లు అర్జున్ పిటిషన్‌పై కోర్టులో విచారణ మొదలైంది.

4:00PM గంటలకు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.

5:00pm కు అల్లు అర్జున్ కు హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *