Indiramma Canteens

Indiramma Canteens: రూ.5కే భోజనం.. హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం

Indiramma Canteens: హైదరాబాద్ నగర పేదలకు, అల్పాదాయ వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నగరంలో కొత్తగా మోతినగర్, ఖైరతాబాద్ మింట్ క్యాంపస్‌లలో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. వీటిని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇద్దరు కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, పలువురు అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

పేదలకు భారీ ఊరట

ఇందిరమ్మ క్యాంటీన్లలో రూ.5కే అల్పాహారం, రూ.5కే భోజనం లభ్యం కానుంది. ఒక్కో టిఫిన్ తయారీలో సుమారు రూ.19, భోజనంలో రూ.29 ఖర్చవుతున్నప్పటికీ ప్రభుత్వం సబ్సిడీ భరించి, లబ్ధిదారులకు కేవలం రూ.5కే అందిస్తోంది. దీంతో పేదలు, అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు, నిరుద్యోగులకు నెలకు సగటున రూ.3 వేల వరకు ఆర్థిక ప్రయోజనం కలగనుంది.

నాణ్యమైన భోజనం – విభిన్న మెనూ

హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్ ఈ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. రోజూ సుమారు 25 వేల మందికి మిల్లెట్ టిఫిన్లు అందించడానికి జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది.

మెనూలో –  ఇడ్లీ , ఉప్మా,  మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరి, పొంగల్, 

ప్రత్యేకంగా మిల్లెట్ ఆహార పదార్థాలను చేర్చడం ద్వారా పౌష్టికాహారం అందించనున్నారు. అయితే, ఆదివారం సెలవు ఇవ్వబడుతుంది.

ఇది కూడా చదవండి: Rishab Shetty: రిషభ్ శెట్టిపై తెలుగు ఆడియన్స్ ఆగ్రహం!

150 కేంద్రాలు లక్ష్యం

ప్రస్తుతం మొదటి దశలో 60 కేంద్రాల్లో రూ.5 అల్పాహారం పథకం ప్రారంభించారు. త్వరలోనే మొత్తం 150 ఇందిరమ్మ క్యాంటీన్లు నగరంలో అందుబాటులోకి రానున్నాయి. మహిళల సాధికారత కోసం ఈ క్యాంటీన్ల నిర్వహణను స్వయం సహాయక సంఘాలకు (SHG) కేటాయించనున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటించారు.

మంత్రుల సందేశం

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ –

> “గరీబి హటావో అనే నినాదంతో ఇందిరమ్మ పేదల కోసం పోరాడారు. అదే స్పూర్తితో సీఎం ఆదేశాల మేరకు క్యాంటీన్లు ప్రారంభించాం. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది” అని అన్నారు.

మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ –

>“పేదలకు ఆహార భద్రత కల్పించడంలో ఇందిరమ్మ క్యాంటీన్లు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. త్వరలోనే నగర వ్యాప్తంగా 150 కేంద్రాలు ప్రారంభిస్తాం” అని తెలిపారు.

చరిత్రలోకి ఒక చూపు

ఇందిరమ్మ క్యాంటీన్‌ల ఆరంభం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే 2013లో జరిగింది. మొదటగా నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభించిన ఈ పథకం, రైల్వే స్టేషన్లు, ఆస్పత్రులు, కూలీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు విస్తరించింది. ప్రస్తుతం నగరంలో 128 కేంద్రాల్లో డైలీ సుమారు 30 వేల మంది భోజనం చేస్తున్నారు. ఇప్పటివరకు 12 కోట్ల మందికి పైగా భోజనం అందించబడింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *