బీ ఆర్ ఎస్ నాయకులపై మంత్రి కోమటిరెడ్డి విమర్శలు చేశారు.మూసీ పరివాహకప్రాంతం ప్రజల్ని బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుందని మంత్రి ఫైర్ అయ్యారు.మూసీ వ్యర్థాలతో నల్గొండ జిల్లా ప్రజలు ఇబ్బందుల పడుతున్నారని.. మూసీ మురికి నల్గొండ జిల్లా ప్రజలకు శాపంగా మారిందని అన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరం లేకున్న మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కట్టి, మల్లన్న సాగర్ బాధితులను బీఆర్ఎస్ గవర్నమెంట్ వేధించిందని చెప్పారు.మిషన్ భగీరథ పథకం కింద రూ.6వేల కోట్లు ఖర్చు చేసినా నల్గొండా జిల్లాకు ఫ్లోరైడ్ తిప్పల ఇంకా పోలేదని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ నేతలు మూసీ ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. పెద్ద అంబర్ పేట్, కుంట్లూర్ వాసులు మూసీ వ్యర్థాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ పథకం కింద రూ.6వేల కోట్లు ఖర్చు చేసినా నల్గొండా జిల్లాకు ఫ్లోరైడ్ తిప్పల ఇంకా పోలేదని.. మూసీ మురికి, ఫ్లోరైడ్ సమస్యలు నల్గొండ జిల్లా ప్రజలకు శాపంగా మారిందిని మంత్రి కోమటి రెడ్డి చెప్పారు.
మూసీ కంపు బీఆర్ఎస్ నేతలకు కనిపించడం లేదా అని నిలదీశారు. మూసీ కంపు బీఆర్ఎస్ నేతలకు కనిపించడం లేదా అని నిలదీశారు. మూసీ కలుషిత నీటితో పండించిన పంటలు తిన్నా అనారోగ్యమే.. ఎంత ఖర్చు అయినా మూసీ నరకం నుంచి తమ జిల్లా ప్రజల్ని బయటపడేయాలి ఆయన కోరారు