Minister KomatiReddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధైర్యంగా ప్రకటించారు.
కోమటిరెడ్డి మాట్లాడుతూ, రెండు పార్టీలకు కలిపి ఎన్ని ఓట్లు వస్తాయో, ఆన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని అన్నారు. ప్రజల విశ్వాసం తమపై ఉందని, జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమం ఆధారంగా ఓటు వేస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
తన ప్రభుత్వం గత 20 నెలల్లో అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి గుర్తుచేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యంగా కొనసాగించామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలు అసలైన ఇందిరమ్మ రాజ్యం ఎలా ఉంటుందో చూడబోతున్నారని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
పేదల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ప్రధాన ధ్యేయమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. పేదల కళ్లలో ఆనందం చూడడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని, ప్రతి పథకం పేదల జీవితాల్లో మార్పు తేవడానికే ఉద్దేశించబడిందని తెలిపారు.
ఈ వ్యాఖ్యలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆత్మవిశ్వాసాన్ని మరింత బలంగా వెల్లడించారు.