Hyderabad : హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఘన విజయం సాధించింది. పార్టీ తరఫున బరిలోకి దిగిన మీర్జా రియాజ్ ఉల్ హసన్ 63 ఓట్లతో విజేతగా నిలిచారు. ప్రధాన ప్రతిస్పర్థిగా బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు ఉండగా, ఆయనకు కేవలం 25 ఓట్లు మాత్రమే లభించాయి. ఫలితంగా 38 ఓట్ల తేడాతో ఎంఐఎం అభ్యర్థి గెలుపొందారు.
ఈ స్థానానికి 22 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగడం విశేషం. గతంలో పెద్దగా హాట్ టాపిక్ కాని ఈ స్థానాన్ని ఈసారి బీజేపీ అనూహ్యంగా పోటీకి రావడం వల్లే ఎన్నిక చర్చనీయాంశంగా మారింది. మొత్తం 112 మంది ఓటర్లు ఉండగా, 88 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. శుక్రవారం (ఏప్రిల్ 25) ఉదయం 8 గంటలకు జీహెచ్ఎంసీ హెడ్‌క్వార్టర్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది, గంట వ్యవధిలోనే ఫలితాలు బయటకు వచ్చాయి.
ఈ ఎన్నికల ప్రత్యేకతేంటంటే, కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ పోటీలో పాల్గొనలేదు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు మద్దతు ఇవ్వగా, బీఆర్ఎస్ పూర్తిగా తటస్థంగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ క్రాస్ ఓటింగ్పై ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఫలితాలు మాత్రం తలనొప్పిగా మారాయి.
Also Read: Pak Terrorism vs India: కొంపకు నిప్పు ఆర్పుకోక భారత్‌పై పాక్ కుట్రలు
ఎన్నిక ఫలితాలు – పూర్తి వివరాలు:
AIMIM మీర్జా రియాజ్ ఉల్ హసన్ 63
BJP గౌతమ్ రావు 25
మొత్తం ఓటర్లు: 112
పోలైన ఓట్లు: 88
గెలుపుదూరం: 38 ఓట్లు
Hyderabad : రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, కాంగ్రెస్ మద్దతుతో పాటు బీఆర్ఎస్ డిస్ఎంగేజ్‌మెంట్ ఎంఐఎం విజయానికి కీలకంగా మారాయని చెబుతున్నారు. ఇక బీజేపీకి ఆశించిన క్రాస్ ఓటింగ్ రాకపోవడం ఓ భారీ వెనుకడుగుగా అభివర్ణిస్తున్నారు.