Skype: మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటించిన ప్రకారం, 2025 మే 5 నుంచి స్కైప్ సేవలు నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. ఒకప్పుడు వీడియో కాల్స్‌కు ప్రముఖ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌గా ఉన్న స్కైప్, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ను ప్రోత్సహించే క్రమంలో స్కైప్ సేవలను పూర్తిగా నిలివేస్తున్నటు మైక్రోసాఫ్ట్ అధికారిక బ్లాగ్‌పోస్ట్‌లో ప్రకటించింది. స్కైప్ వినియోగదారులు తమ ప్రస్తుత ఖాతా వివరాలతో టీమ్స్‌లో లాగిన్ అవ్వడం ద్వారా తమ డేటాను ఆటోమేటిక్‌గా బదిలీ చేసుకోవచ్చు.
ఒకవేళ టీమ్స్‌కు మారాలనుకోకపోతే, వినియోగదారులు తమ చాట్ హిస్టరీ, కాంటాక్ట్‌లు, ఇతర డేటాను ఎగుమతి చేసుకునే అవకాశం కూడా ఉంది. టీమ్స్‌లో వన్-ఆన్-వన్ & గ్రూప్ కాల్స్, సందేశాలు, ఫైల్ షేరింగ్, సమావేశ హోస్టింగ్, కమ్యూనిటీ ఫీచర్లు వంటి అదనపు సౌకర్యాలు లభిస్తాయి.
Also Read: Oscar Awards 2025: ఇండియాకు ఆస్కార్ నిరాశ .. విజేతలు వీరే
Skype: స్కైప్ క్రెడిట్, కాలింగ్ సబ్‌స్క్రిప్షన్ వంటి చెల్లింపు సేవలు కొత్త వినియోగదారులకు నిలిపివేయబడతాయి, అయితే ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రైబర్‌లు తమ ప్లాన్ ముగిసే వరకు వాటిని ఉపయోగించుకోవచ్చు. స్కైప్ సేవల ముగింపు ద్వారా, మైక్రోసాఫ్ట్ మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థను టీమ్స్ వైపు మార్చాలని చూస్తోంది. మే 5 తర్వాత స్కైప్ పూర్తిగా నిలిపివేయబడే అవకాశముండటంతో, వినియోగదారులు త్వరగా టీమ్స్‌కు మారడం ఉత్తమ ఎంపిక.

