Plastic: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం చక్కెర, ఉప్పులో మైక్రో ప్లాస్టిక్ వాడకం గురించి ప్రభుత్వానికి తెలుసని చెప్పారు. ఈ విషయంలో అనేక అధ్యయనాలు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా – FSSAI శాస్త్రీయ ప్యానెల్‌లో స్వతంత్ర నిపుణులు జరిపారు. ఆహార ఉత్పత్తులలో కలుషితాలుగా మైక్రో , నానో ప్లాస్టిక్‌ల విస్తృత వినియోగం, వ్యాప్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని పార్లమెంట్ లో ప్రభుత్వం వెల్లడించింది.
రాజస్థాన్‌లోని టోంక్-సవాయి మాధోపూర్ జిల్లాతో సహా దేశంలో వినియోగించే ఉప్పు, పంచదారలో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నట్లు నివేదించిన అధ్యయనాల గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలియదా అని లోక్‌సభలో ఆరోగ్య – కుటుంబ సంక్షేమ మంత్రిని సభ్యులు ప్రశ్నించారు. ఆహార పదార్థాల్లో మైక్రోప్లాస్టిక్ ఉనికిని పరీక్షించడానికి లేదా దాని స్థాయిని అంచనా వేయడానికి ఏదైనా పరిశోధన జరిగిందా అని కూడా అడిగారు.
ఇది కూడా చదవండి: Narendra Modi: ఈశాన్య రాష్ట్రాలపై గత ప్రభుత్వాలు శ్రద్ధ చూపలేదు
Plastic: దీంతో పాటు ఉప్పు, పంచదార , ఇతర అవసరమైన ఆహార పదార్థాలలో మైక్రోప్లాస్టిక్‌లను కలపడాన్ని పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంది అంటూ ప్రశ్నలు లేవనెత్తారు సభ్యులు. ఈ ప్రశ్నలకు సమాధానంగా ఆరోగ్య – కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ ఉప్పు మరియు చక్కెర నమూనాలలో మైక్రోప్లాస్టిక్‌లను గుర్తించిన అధ్యయనం గురించి ప్రభుత్వానికి తెలుసు అని వెల్లడించారు.