Varanasi

Varanasi: వారణాసి గ్లింప్స్‌లో సీక్రెట్ డీటెయిల్స్.. మైండ్ బ్లోయింగ్ హింట్స్!

Varanasi: సూపర్‌స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వారణాసి’ గ్లింప్స్ వచ్చిన 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది. ఈ వీడియోలో జక్కన్న దాచిన మైక్రో డీటెయిల్స్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పుడు మరోసారి ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తే మతిపోయే హిడెన్ క్లూస్ బయటపడుతున్నాయి.

Also Read: Ramoji Excellence Awards: రామోజీ ఎక్స్‌లెన్స్‌ జాతీయ అవార్డు గ్రహీతలు వీరే..

ఉల్కపాతం వెనుక అంటార్కిటికా పర్వతంపై బోట్‌లో మనుషులు కనిపిస్తారు, ఏదో రహస్యాన్ని తవ్వుతున్నట్టు సూచన ఉంటుంది. అలాగే మంచులో చిరిగిపోయిన పడవ ముక్కలు కనిపిస్తాయి. గుహలో ప్రియాంక చోప్రా ఉన్న సీన్‌కు లింక్‌గా నీటి ఏనుగులు, చేపలు పట్టే వాళ్లు, గన్స్ పట్టుకున్న సైనికులు దూరంగా కనిపిస్తారు. అదే షాట్‌లో కొండచరియ అంచున మహేష్ సిల్హౌట్ కనిపిస్తుంది కానీ ప్రియాంకకు చాలా దూరంలో ఉంటుంది. కింద ఒక సాధువు కపాలాల మధ్య హోమం చేస్తూ కనిపిస్తాడు. లంకా సీన్‌లో హనుమంతుడి తోకపై గుర్రపు బండి, చేతిలో మొత్తం వృక్షంతో యుద్ధం చేస్తున్న ఆంజనేయుడు, వానర సైన్యం వెనుక ఒకే ఆకారంలో ఉన్న పర్వత శ్రేణి, రామ బాణం నుంచి వచ్చే బ్లూ ఫ్లాష్‌లో నీటి సుడిగుండం పైన తిరిగే చక్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇవన్నీ టైమ్ ట్రావెల్ పోర్టల్‌కు సంబంధించినవే అని అర్థమవుతోంది. ఇంకా జక్కన్న మరిన్ని సీక్రెట్స్ దాచి పెట్టారన్నది తెలుస్తుంది. దీంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని మించిపోయాయి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *