Crime News: ఉద్యోగస్థలాల్లో ఒత్తిడి సాధారణమే. కానీ కొన్ని సందర్భాల్లో అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన దీనికి ఉదాహరణ. మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి అఫెని ముహమ్మద్ (26) తన మేనేజర్ జెన్నిఫర్ హారిస్ (39) ను కసితో 15 సార్లు కత్తితో పొడిచి చంపేసింది.
మానసిక వేధింపులే కారణం
వివరాల ప్రకారం, జెన్నిఫర్ హారిస్ తరచూ అఫెనిపై పని సరిగా చేయడం లేదని తీవ్రంగా విమర్శించేది. కొన్నిసార్లు ఆమెను ఇంటికి పంపించేవారని సమాచారం. ఈ విషయాలను అఫెని మానసిక వేధింపులుగా భావించింది.
హత్యకు ఒక రోజు ముందు అఫెని తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్లో “నా మేనేజర్ నన్ను చిన్నచూపు చుస్తునారు… ఇక భరించలేను” అంటూ పోస్ట్ చేసింది. జూలై 12న మళ్లీ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన అఫెని తన కారు వద్దకు వెళ్లి, అక్కడి నుండి కత్తి తీసుకువచ్చి జెన్నిఫర్‌పై దాడి చేసింది.
ఇది కూడా చదవండి: Cannabis chocolates: తెలంగాణలో గంజాయి చాక్లెట్ల కలకలం..
సంఘటన వివరాలు
అఫెని ఒక్కసారిగా ఆగ్రహానికి లోనై, మేనేజర్‌ను 15 సార్లు కత్తితో పొడిచింది. జెన్నిఫర్ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దృశ్యం చూసిన మరో ఉద్యోగి వారిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ అప్పటికే జెన్నిఫర్ ప్రాణాలు కోల్పోయింది. అనంతరం అఫెని పారిపోవడానికి ప్రయత్నించగా, అక్కడి సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
కోర్టు విచారణ
జెన్నిఫర్ తరఫు న్యాయవాది, ఇది ముందుగానే ప్రణాళిక చేసిన హత్య అని కోర్టులో వాదిస్తున్నారు. అఫెని ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉంది. ఆమెపై హత్యారోపణలు నమోదు అయ్యాయి.
ఉద్యోగస్థలాల్లో ఒత్తిడి ఆందోళనకరం
ఈ ఘటన మరోసారి ఉద్యోగస్థలాల్లో మానసిక ఒత్తిడి ఎంత ప్రమాదకరమో చూపించింది. సీనియర్ ఉద్యోగులు తక్కువ స్థాయి సిబ్బందిపై కేకలు వేయడం, అవమానించడం వంటి వ్యవహారాలు కొందరిని తీవ్ర నిర్ణయాలు తీసుకునేలా మారుస్తున్నాయి. కొంతమంది ఉద్యోగాలు వదిలేస్తే, మరికొందరు ఆత్మహత్యకు కూడా పాల్పడుతున్నారు.
McDonald’s Manager and Mother of 6 Stabbed to Death by This Employee pic.twitter.com/cXd4pzt0Zk
— The Facts Dude (@The_Facts_Dude) July 11, 2025