IPL 2025

IPL 2025: పంజాబ్ కింగ్స్ జట్టులోకి డేంజరస్ ప్లేయర్!

IPL 2025: ఆదివారం క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌ జరగబోతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS), ముంబై ఇండియన్స్ (MI) తలబడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్‌లో ఆర్‌సిబితో తలపడుతుంది. ఆర్‌సిబి చేతిలో ఓడిపోయి ఫైనల్‌లోకి నేరుగా ప్రవేశించే అవకాశాన్ని కోల్పోయిన పంజాబ్ కింగ్స్, ఈ మ్యాచ్‌లో గెలిచి ఎలాగైనా ఫైనల్‌కు చేరుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ముంబై ఇండియన్స్ గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి క్వాలిఫయర్ 2కి దూసుకెళ్లింది.

అదేవిధంగా, పంజాబ్ జట్టును ఓడించి ఫైనల్‌కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఓ శుభవార్త అని చెప్పాలి. జట్టులో ప్రముఖ స్పిన్నర్. ప్రమాదకరమైన ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. గాయం కారణంగా చాహల్ గత కొన్ని మ్యాచ్‌లలో బెంచ్ కే పరిమితమయ్యాడు. అతను లేనప్పుడు పంజాబ్ బౌలింగ్ కాస్త బలహీనంగా ఉందన్నది నిజమే. RCBతో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో చాహల్ లేకుండానే పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది.

ఇది కూడా చదవండి: Rinku Singh Wedding: ఎంపీ ప్రియాతో రింకూ సింగ్‌ పెళ్లి తేదీ ఫిక్స్..జూన్ 8న నిశ్చితార్థం

అయితే, ఇప్పుడు చాహల్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. ముంబైతో జరిగే కీలక మ్యాచ్ లో అతను ఆడనున్నాడని తెలిసింది. చాహల్ రాక పంజాబ్ బౌలింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుందనడంలో సందేహం లేదు. ముంబై ఇండియన్స్ విషయానికొస్తే, కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఇది జట్టు బ్యాటింగ్‌కు పెద్ద బలం. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు.

అయితే, ముంబై జట్టుకు అతిపెద్ద ఆందోళన బౌలింగ్ విభాగంలో ఉంది. స్‌ప్రీత్ బుమ్రా తప్ప మిగతా బౌలర్లు ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వడం లేదు. అయితే, ప్రస్తుత ఫామ్, జట్టు సమతుల్యతను దృష్టిలో ఉంచుకుంటే, ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *