CM Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన సంతాప సందేశాన్ని అనువదించేటప్పుడు మెటా ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్ టూల్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరణించినట్లు తప్పుగా ప్రకటించింది. “ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిన్న కన్నుమూశారు, బహుభాషా నటుడు, సీనియర్ నటి బి. సరోజాదేవి పార్థివ దేహానికి చివరి నివాళులర్పించారు” అని పోస్ట్ తప్పు అనువాదంలో ఉంది. ప్రముఖ నటి బి సరోజా దేవి మృతికి సంతాపం తెలుపుతూ కన్నడలో రాసిన ఈ పోస్ట్‌ను ఆంగ్లంలోకి తప్పుగా అనువదించడంతో సిద్ధరామయ్య తీవ్ర విమర్శలు చేయడంతో పాటు మెటాకు అధికారిక లేఖ కూడా పంపారు. కన్నడ నుంచి ఇంగ్లీషులోకి అనువాదం చేయడం ఆపేయాలని మెటాపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం సిద్ధరామయ్య.
Also Read: Akshay Kumar: హ్యాట్సాఫ్ అక్షయ్ కుమార్ .. 650 మంది స్టంట్ మ్యాన్‌లకు ఇన్సూరెన్స్ పాలసీ
జరిగిన తప్పిదాన్ని సవరించాలని తన మీడియా సలహాదారు మెటాకు లేఖ రాశారని వెల్లడించారు. మెటా ప్లాట్‌ఫామ్‌లలో కన్నడ కంటెంట్‌ను తప్పుగా ఆటో-అనువాదం చేయడం వల్ల వాస్తవాలు వక్రీకరించబడుతున్నాయి. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి. అధికారిక సమాచార మార్పిడి విషయానికి వస్తే ఇది చాలా ప్రమాదకరం. నా మీడియా సలహాదారు కెవి ప్రభాకర్ వెంటనే సరిదిద్దాలని కోరుతూ మెటాకు అధికారికంగా లేఖ రాశారు” అని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. అయితే ఈ ఘటనపై మెటా కంపెనీ గురువారం క్షమాపణలు చెప్పింది. ఇలా జరిగినందుకు మేము క్షమాపణలు కోరుతున్నామని మెటా ప్రతినిధి తెలిపారు.

