Messi: తెలుగువారిని కలవడం సంతోషంగా ఉంది:

Messi: హైదరాబాద్ నగరానికి వచ్చి తెలుగు ప్రజలను కలవడం ఎంతో సంతోషంగా ఉందని ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ అన్నారు. తెలుగు ప్రజలు చూపిన అపూర్వమైన అభిమానం తనకు మరింత శక్తి, ప్రోత్సాహాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.

మెస్సీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పాల్గొన్నారు. ఈ మ్యాచ్‌లో మెస్సీ అపర్ణ మెస్సీ టీమ్ తరఫున ఆడగా, రేవంత్ రెడ్డి సింగరేణి ఆర్‌ఆర్ జట్టు తరఫున బరిలోకి దిగారు. అభిమానులతో నిండిన స్టేడియంలో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది.

మ్యాచ్‌లో సింగరేణి ఆర్‌ఆర్ జట్టు పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించి, 3-0 గోల్స్ తేడాతో అపర్ణ మెస్సీ జట్టుపై ఘన విజయం సాధించింది. రెండు జట్ల ఆటగాళ్ల ప్రతిభకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు.

మ్యాచ్ అనంతరం సింగరేణి ఆర్‌ఆర్ జట్టుకు లియోనల్ మెస్సీ స్వయంగా ట్రోఫీని అందజేశారు. అలాగే అపర్ణ మెస్సీ జట్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మెస్సీ, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి తన పేరుతో ఉన్న జెర్సీలను అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ అభిమానులకు చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చిందని క్రీడాభిమానులు పేర్కొన్నార.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *