Megastar Chiranjeevi:రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు కవలలు జన్మించారని, అది తమ కుటుంబానికి, అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఎంతో ఆనందం కలిగించే వార్త అని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. అపోలో ఆసుపత్రిలో ఈ రోజు (ఫిబ్రవరి 1) ఆయన ఉపాసనను పరామర్శించి, వైద్యులతో సంప్రదించారు. అనంతరం అపోలో ఎదుట మీడియాతో మాట్లాడారు. తనకు ఇది ఎంతో శుభవార్త అని ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ ఆనందాన్ని మీతో పంచుకోవడం తనకెంతో సంతృప్తిగా ఉన్నదని చెప్పారు.
Megastar Chiranjeevi:భగవంతుడి దయ వల్ల, హనుమాన్ కృప వల్ల ఉపాసన, రామచరణ్ దంపతులకు ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ జన్మించారని చిరంజీవి చెప్పారు. ఈ శుభవార్తను షేర్ చేసుకోవడం తనకు అత్యంత ఆనందంగా ఉన్నదని చెప్పారు. గైనకాలజీ విభాగం (చైన్నై అపోలో ఆసుపత్రి) ప్రత్యేక వైద్యురాలు డాక్టర్ సుమణ ఈ కాన్పు చేశారని చిరంజీవి చెప్పారు. ఉపాసన, రాంచరణ్ దంపతుల తొలి సంతానమైన క్లీంకారకు డాక్టర్ సుమణ కాన్పు చేశారని వెల్లడించారు.
Megastar Chiranjeevi:సుమణతోపాటు అపోలో గైనకాలజీ విభాగం హెడ్ డాక్టర్ రుమా సిన్హా, పీడియాట్రిక్ స్పెషలిస్టు డాక్టర్ లతకు, ఇతర విభాగం వైద్యులు, సిబ్బందికి ఈ సందర్భంగా చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ఇది మెగా, కామినేని కుటుంబాలకు ఎంతో శుభవార్త అని, తమ ఆనందానికి ఎంత చెప్పినా తక్కువేనని, దానికి అవధులు లేవని చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తంచేశారు.
