Vishwambhara: మెగా స్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ చిత్రం సంక్రాంతికి రావాల్సింది. అయితే అనుకున్న సమయంలో షూటింగ్ పూర్తి కాకపోవడం, వీఎఫ్ఎక్స్ కు మరింత సమయం పట్టడంతో మూవీ రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. ఫిబ్రవరిలో శివరాత్రి కానుకగా దీనిని తీసుకురావచ్చని వార్తలు వచ్చాయి కానీ అదీ సాధ్యం కాదని తెలిసిపోయింది. ఇక ఇప్పుడీ సినిమాను ఏకంగా మే 9కి వాయిదా వేస్తారని అంటున్నారు. ఎందుకంటే మే 9 చిరంజీవికి బాగా కలిసొచ్చిన రోజు. అదే రోజున ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం విడుదలై ఘన విజయాన్ని సాధించింది. కాబట్టి ఆ రోజునే దీనిని విడుదల చేయాలనుకుంటున్నారట. ఇదిలా ఉంటే ఇప్పటికే మే 9న రవితేజ ‘మాస్ జాతర’ను రిలీజ్ చేస్తున్నట్టు సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ప్రకటించింది. అదే జరిగితే… రెండేళ్ళ క్రితం సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’లో కలిసి నటించిన చిరంజీవి, రవితేజ ఇప్పుడు ఒకరితో ఒకరు పోటీ పడినట్టు అవుతుంది.
