Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: మెగా విక్టరీ మల్టీ స్టారర్? రచ్చ రచ్చే!

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి సినిమా చేస్తున్న విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే మూహూర్తం కూడా అయిపోయింది. ఈ చిత్రంలో చిరంజీవి అసలు పేరు ‘శివశంకర వరప్రసాద్’ పాత్రలో కనిపించనున్నట్లు అనిల్ వెల్లడించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంచనాలు పెరిగాయి. అయితే, మరో ఆసక్తికర అప్‌డేట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. మూవీ టీం వెంకీని సంప్రదించినట్లు తెలుస్తున్నా, ఆయన సమ్మతి ఇంకా సస్పెన్స్‌లో ఉంది. చిరంజీవి, వెంకటేష్ మధ్య బలమైన బాండింగ్ అందరికీ తెలిసిందే. ఇద్దరూ మల్టీస్టారర్ చేయాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు.

Also Read:  Hari Hara Veera Mallu: ఫ్యాన్స్ ని మళ్లీ నిరాశపరిచిన వీరమల్లు!

Megastar Chiranjeevi : వెంకటేష్ 75వ సినిమా ఈవెంట్‌లో చిరు పాల్గొన్నప్పుడు, వెంకీ “మెగాస్టార్ వెనక కత్తి పట్టుకుని నడిచే పాత్ర చేయాలనుంది” అని చమత్కరించారు. ఇప్పుడు ఆ కల నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. అనిల్‌తో వెంకీకి కూడా సన్నిహిత సంబంధం ఉంది. వీరి కాంబోలో వచ్చిన ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్స్‌గా నిలిచాయి. చిరుతో స్నేహం, అనిల్‌తో అనుబంధం కారణంగా వెంకీకి ఈ రోల్ ఆఫర్ వచ్చినట్లు చెబుతున్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  OG: పవర్ స్టార్ ఓజీ ఫైనల్ షూట్.. ముంబైలో మరో రౌండ్ యాక్షన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *