Megastar Chiranjeevi:

Megastar Chiranjeevi: చిరంజీవి బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చంద్ర‌బాబు లోకేశ్‌, బ‌న్నీ ఏమ‌న్నారంటే? ప‌వ‌న్ గురించి చిరు ఏమ‌న్నారో తెలుసా!

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజును ఈరోజు (ఆగ‌స్టు 22) రెండు తెలుగు రాష్ట్రాల‌తోపాటు ప్ర‌పంచ వ్యాప్తంగా మెగా అభిమానులు సంద‌డిగా జ‌రుపుకుంటున్నారు. ప‌లు చోట్ల కేక్‌లు క‌ట్ చేస్తూ స్వీట్లు పంచుకుంటూ సంబురాలు జ‌రుపుకుంటున్నారు. మ‌రికొన్ని చోట్ల ర‌క్త‌దానాలు, ఆసుప‌త్రుల్లో పండ్లు, బ్రెడ్డు పంపిణీలు చేస్తూ మెగాస్టార్ చిరంజీవిపై త‌మ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో చిరంజివి బ‌ర్త‌డేనాడు ప్ర‌ముఖులు ఏమ‌న్నారో తెలుసుకుందాం.

Megastar Chiranjeevi: చిరంజీవి ప్ర‌యాణం ఎంద‌రికో స్ఫూర్తి నింపుతుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కొనియాడారు. ఎక్స్ వేదిక‌గా ఆయ‌న చిరంజీవికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. సినిమా, ప్ర‌జా జీవితంలో మీ అద్భుత‌మైన ప్ర‌యాణం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. దాతృత్వం, అంకిత‌భావంతో మీరు ఇలాగే చాలా మంది జీవితాల‌ను క‌దిలించేలా కొన‌సాగాలి అని ఆకాంక్షించారు. మీకు మంచి ఆరోగ్యం, ఆనందం క‌ల‌గాల‌ని, మీ భావి జీవితం మ‌రింత ఉజ్వ‌లంగా ఉండాల‌ని కోరుతున్న‌ట్టు తెలిపారు.

Megastar Chiranjeevi: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి నారా లోకేశ్‌, న‌టుడు అల్లు అర్జున్ వేర్వేరుగా మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. సినిమా, స‌మాజానికి మీరు చేసిన అద్భుత‌మైన కృషి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. వ‌న్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. వీరితోపాటు ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ‌కీయ నాయ‌కులు చిరంజీవికి పుట్టిన‌రోజు వేడుక‌లు వెల్లువెత్తుతున్నాయి.

Megastar Chiranjeevi: చిరంజీవి70వ పుట్టిన‌రోజున మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చోటుచేసుకున్న‌ది. త‌న సోద‌రుడైన మెగాస్టార్ చిరంజీవికి ఏపీ డిప్యూటీ సీఎం, న‌టుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. అయితే త‌మ్ముడి బ‌ర్త్‌డే విషెస్ కు చిరంజీవి బ‌దులిచ్చారు. త‌మ్ముడు క‌ల్యాణ్ న‌న్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో.. నీ విజ‌యాల్ని, నీ పోరాటాల్ని చూసి నేనూ అంతే ఆస్వాదిస్తున్నా.. నీ వెనుకున్న కోట్లాది మంది జ‌న సైనికుల‌ను ఓ రాజువై న‌డిపించు.. వారి ఆశ‌ల‌కు, క‌ల‌ల‌కు కొత్త శ‌క్తినివ్వు.. నా ఆశీర్వ‌చ‌నాలు నీతోనే ఉంటాయి. ప్ర‌తి అడుగులోనూ విజ‌యం నిన్ను వ‌రించాల‌ని ఆ భ‌గ‌వంతుడిని కోరుకుంటున్నా.. అని చిరంజీవి పోస్టు చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Game changer: అందరి చూపు రాజమండ్రి వైపు.. గేమ్ చేంజ్ చేయడానికి వస్తున్న పవన్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *