మెగా ఫ్యాన్స్ కి డబుల్ దసరా.. రెక్కల గుర్రం మీదొచ్చిన చిరు..

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న ‘విశ్వంభర’ సినిమా పై క్రేజ్ అప్డేట్ వచ్చింది. దసరా పండగ పూట ‘విశ్వంభర’ టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేయగా ఎప్పుడు టీజర్ ను వదలడంతో ఫ్యాన్స్ కి డబుల్ దసరా ధమాకా వచ్చినట్టుంది.

టీజర్ లో చిరంజీవి తెల్లని రెక్కల గుర్రంపై వచ్చే షాట్ హై లైట్ గా నిలిచింది. చాలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. చూస్తుంటే రాక్షసుల లోకం, మరో ప్రపంచం ఉన్నట్టు, చిరంజీవికి దైవాంశ ఉన్నట్టు, దుష్టశక్తులను ఎదిరించినట్టు తెలుస్తుంది. టీజర్ లో మొత్తం గ్రాఫిక్స్ తోనే నిండిపోయింది.

విశ్వంభర సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో పాటు సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా చిరంజీవికి చెల్లెలుగా మరో అయిదుగురు నటిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ అనుకున్నారు. కానీ గేమ్ ఛేంజర్ సంక్రాంతికి వాయిదా వేయడంతో విశ్వంభర సినిమాని వాయిదా వేశారు. మరో డేట్ ను మేకర్స్ త్వరలోనే ప్రకటించబోతున్నటు తెలుస్తోంది.

https://youtube.com/watch?v=NCv-wz1nSnE&si=ejldAYdEkK7Z32yg

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa Vamsi: అధికారులారా.! ఆధారాలు కావాలా ? మీకు మేము ఇస్తాం రండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *