Thug Life

Thug Life: థగ్ లైఫ్ తో మెగా ఫ్యాన్స్ టెన్షన్.. పెద్ది సినిమాపై ఆందోళన!

Thug Life: కమల్ హాసన్, మణిరత్నం కలయికలో వచ్చిన ‘థగ్ లైఫ్’ సినిమా నీరసమైన స్పందనతో ప్రేక్షకులను నిరాశపరిచింది. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపై మెగా ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్టుకు కూడా రెహమాన్ సంగీతమే కావడం ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. సినిమా విజయంలో సంగీతం కీలకమని, ‘థగ్ లైఫ్’లాంటి నిరాశ రామ్ చరణ్ సినిమాకు రిపీట్ అయితే ఫలితం దెబ్బతింటుందని ఫ్యాన్స్ భయపడుతున్నారు. ‘పెద్ది’లో రెహమాన్ తన స్థాయికి తగ్గట్టుగా సంగీతంతో గట్టెక్కిస్తాడా లేక మరోసారి నిరాశపరుస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. మరి, ఈ సినిమాతో రెహమాన్ మెగా ఫ్యాన్స్ ఆశలను నిజం చేస్తాడా? వేచి చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *