Bhairavam

Bhairavam: మెగా అభిమానుల ఆగ్రహం.. ‘భైరవం’ సినిమాపై బాయ్‌కాట్ ట్రెండ్!

Bhairavam: టాలీవుడ్‌లో యువ హీరోలు మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటించిన లేటెస్ట్ చిత్రం ‘భైరవం’. ‘నాంది’ ఫేమ్ దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే, ఈ చిత్రాన్ని మెగా అభిమానులు బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం.. గతంలో విజయ్ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లపై అనుచిత పోస్ట్‌లు షేర్ చేశారని అభిమానుల ఆరోపణ. ఈ వివాదంతో మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో విజయ్ స్పందిస్తూ.. ఆ పోస్ట్‌లు తాను షేర్ చేయలేదని, ఎవరో హ్యాక్ చేసి ఉండొచ్చని వివరణ ఇచ్చారు. మెగా హీరోలతో కలిసి పనిచేసినప్పుడు వారి నుంచి ఎంతో ప్రోత్సాహం లభించిందని, తానూ మెగా అభిమానినేనని చెప్పుకొచ్చారు. అంతేకాదు, అభిమానులకు క్షమాపణ చెబుతూ ఓ పోస్ట్‌తో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘భైరవం’ చుట్టూ ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  The Raja Saab: ‘రాజాసాబ్’ ఆడియో రైట్స్ సంచలన డీల్.. ప్రభాస్ మ్యాజిక్ రెడీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *