Mega DSC 2025: అమరావతిలో శుక్రవారం నిర్వహించాల్సిన మెగా డీఎస్సీ నియామక పత్రాల సభ వాయిదా పడింది. ఈ సభలో తాజాగా ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, గుంటూరులో కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికలు కారణంగా అభ్యర్థుల రాకపోకలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Sai Dharam Tej: మన జీవితానికి మనదే బాధ్యత.. హెల్మెట్టే నా ప్రాణాలను కాపాడింది
డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి గురువారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, సభను వాయిదా వేసినప్పటికీ కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తాం అని స్పష్టం చేశారు.
ఇక ఇప్పటికే రాయలసీమ సహా పలు జిల్లాల నుంచి అభ్యర్థులు సభకు బయల్దేరగా, వాయిదా సమాచారం అందుకున్న తర్వాత వారు మధ్యలోనే వెనుదిరిగినట్లు సమాచారం. ఈ పరిణామం కారణంగా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులలో నిరాశ వ్యక్తమవుతోంది.