Mega Couple: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం “పెద్ది”పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచగా, ఇప్పుడు “పెద్ది” గ్లింప్స్ కోసం అంతా ఉవ్విళ్లూరుతున్నారు.
ఈ నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సానాకు రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన ఇచ్చిన డివోషనల్ సర్ప్రైజ్ హాట్ టాపిక్‌గా మారింది. హనుమాన్ పాదుకలు, పుస్తకాలతో కూడిన ఈ బహుమతిని బుచ్చిబాబు సోషల్ మీడియాలో షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. దీంతో ఈ పోస్ట్‌తో పాటు ఫొటోలు వైరల్‌గా మారాయి.
Also Read: ED Rides: ఎంపురాన్ నిర్మాత గోకులం గోపాలన్ ఆస్తులపై ఈడీ రైడ్స్
Mega Couple: ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, రామ్ చరణ్-జాన్వీ జోడీ కెమిస్ట్రీ ఎలా ఉంటుందనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా “పెద్ది” సినిమా టాలీవుడ్‌లో మరో సంచలనం సృష్టించేలా కనిపిస్తోంది.