Mega 157

Mega 157: మెగా157 జోరు.. కేరళలో క్రేజీ సాంగ్?

Mega 157: మెగాస్టార్ చిరంజీవి, నయనతార జోడీ మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. మెగా157 చిత్రం మూడో షెడ్యూల్ కేరళలోని అలప్పుజా సమీపంలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఓ అద్భుతమైన పాట చిత్రీకరణ జరుగుతోంది. సంక్రాంతి వస్తున్నాం చిత్రానికి కొరియోగ్రఫీ చేసిన భాను, ఈ పాటకు ప్రత్యేక నృత్య రీతిని రూపొందించారు. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం ఈ పాటకు మరింత ఆకర్షణను తెస్తోంది.

Also Read: Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు2 అప్డేట్‌తో అభిమానుల్లో ఉత్సాహం?

దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో, బడ్జెట్‌ను నియంత్రిస్తూనే అత్యుత్తమ విజువల్ అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ షెడ్యూల్ జులై 23 వరకు కొనసాగనుంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pawan Kalyan: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *