Meerpet Murder:

Meerpet Murder: మీర్‌పేట మ‌హిళ హ‌త్య‌కేసులో మ‌రో ముగ్గురి హ‌స్తమున్న‌దా? వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు

Meerpet Murder: దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన‌ మీర్‌పేట మ‌హిళ హ‌త్య‌కేసులో మ‌రో సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డైంది. మ‌హిళ వెంక‌ట‌మాధ‌విని హ‌త్య చేసిన‌ భ‌ర్త ఒక్క‌డే కాదు.. మ‌రో ముగ్గురినీ కార‌కులుగా పోలీసులు గుర్తించిన‌ట్టు తాజాగా వెల్ల‌డైంది. వారిలో ఓ మ‌హిళ ఉన్న‌ట్టు భావిస్తున్నారు. దీంతో ఇప్ప‌టిదాకా ఆమె భ‌ర్త గురుమూర్తి ఒక్కడే ఆమెను హ‌త్య చేసిన‌ట్లు భావిస్తూ వ‌చ్చారు. పోలీసులు విచార‌ణ‌లో ఆల‌స్యంగా ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి.

Meerpet Murder: హైద‌రాబాద్‌ మీర్‌పేట మ‌హిళ వెంక‌ట‌మాధ‌వి హ‌త్య కేసులో నిందితుడు గురుమూర్తిని 5 రోజులు క‌స్ట‌డీలోకి తీసుకున్న పోలీసులు.. హ‌త్య‌కు స‌హ‌క‌రించిన వారి వివ‌రాల‌ను అత‌ని నుంచి రాబ‌ట్టారు. వారితో ఆల‌స్యంగా అస‌లు విష‌యాలు బ‌య‌ట‌పెట్టాడు. త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసే ఈ హ‌త్య‌కు ప్లాన్ చేసిన‌ట్టు ఒప్పుకున్నాడు. ప్ర‌ణాళిక ప్రకార‌మే గురుమూర్తి ఆమెను హ‌త్య చేసిన‌ట్టు పోలీసుల ద‌ర్యాప్తులో తేలిన‌ట్టు తెలుస్తున్న‌ది.

Meerpet Murder: వెంక‌ట‌మాధ‌వి హ‌త్య‌లో మృతురాలి భ‌ర్త గురుమూర్తి ఈ హ‌త్యకేసులో ఏ1 నిందితుడిగా ఉన్నాడు. అత‌నికి ఈ హ‌త్య‌కు స‌హ‌క‌రించిన‌ ఆయ‌న చెల్లెలు సుజాత‌ను ఏ2గా, త‌ల్లి సుబ్బ‌ల‌క్ష్మిని ఏ3గా, త‌మ్ముడు కిర‌ణ్‌ను ఏ4గా రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు చేర్చిన‌ట్టు స‌మాచారం. విచార‌ణ‌లో ఈ కీల‌క విష‌యాలు వెల్ల‌డైన‌ట్టు తెలిసింది.

Meerpet Murder: వెంక‌ట‌మాధ‌వి హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడిపై వివిధ సెక్ష‌న్లు న‌మోదు చేయ‌గా, మిగ‌తా ముగ్గురిపై బీఎన్ఎస్‌లోని 85 సెక్ష‌న్ గృహహింస ప్ర‌యోగించార‌న్న కేసు న‌మోదు చేసిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ ముగ్గురూ ప‌రారీలో ఉన్న‌ట్టు పోలీసులు తెలిపారు. వారికోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు తెలిసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *