Hyderabad: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అనుబంధ సంఘాల నాయకులతో భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పార్టీ కార్యాచరణ, నాయకుల పనితీరు, భవిష్యత్తు కార్యసూచిపై చర్చ జరిగింది.
నేతల పనితీరు పై స్పష్టమైన సందేశం
సమావేశంలో పాల్గొన్న నేతలు తమ పని తీరు నివేదికలు సమర్పించారు. అయితే, “మీరు నివేదికలు ఇవ్వకపోయినా ఎవరి పని తీరు ఏంటో నాకు తెలుసు. పార్టీ కోసం నిజంగా కష్టపడుతున్నవారెవరు? కేవలం యాక్టింగ్ చేసే వారెవరు? అన్నది స్పష్టంగా తెలుసు” అంటూ మీనాక్షి నటరాజన్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
పార్టీ కోసం సమయం కేటాయించాలని సూచన
నేతలు, కార్యకర్తలు పార్టీ కోసం పూర్తి సమయం కేటాయించాలని ఆమె సూచించారు. “పార్టీ అంతర్గత విషయాలను బయట చర్చించకండి. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు” అని ఆమె హెచ్చరించారు.
రాహుల్, సోనియాకి ఫిర్యాదు చేయవచ్చేమాని బయట మాట్లాడొద్దు
తన పని తీరు నచ్చకపోతే రాహుల్ గాంధీ లేదా సోనియా గాంధీకి ఫిర్యాదు చేయొచ్చని, కానీ మీడియా లేదా బహిరంగ వేదికలపై విమర్శలు చేయొద్దని స్పష్టం చేశారు. “బయట మాట్లాడితే చర్యలు తీసుకోవడం తప్పదు” అంటూ ఆమె హెచ్చరించారు.
ఈ భేటీలో నేతల పనితీరుపై సమీక్ష జరిపిన మీనాక్షి నటరాజన్, పార్టీ బలోపేతం కోసం అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ఇకపై పార్టీ విధేయతకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేయడం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
