Revanth Reddy

Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డితో మీనాక్షి నటరాజన్‌, పీసీసీ చీఫ్‌మహేష్‌ కుమార్‌ గౌడ్‌ భేటీ

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక సమావేశం అయ్యారు. పార్టీని బలోపేతం చేయడం, చేపట్టబోయే పాదయాత్ర, అలాగే బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో చేయాల్సిన పోరాటం గురించి ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు గంటన్నరకు పైగా సాగిన ఈ చర్చలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.

పాదయాత్ర షెడ్యూల్
కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర యథావిధిగా ఈ నెల 31 నుంచి ఆగస్టు 4 వరకు కొనసాగనుంది. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించడం, వారి సమస్యలను తెలుసుకోవడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం.

బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరాటం
ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో బీసీ రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున పోరాటం చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం ఈ కార్యాచరణను చేపట్టనున్నారు.

ఆగస్టు 6న: జంతర్ మంతర్ వద్ద పెద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ బీసీ సంఘాల నాయకులు పాల్గొంటారు.

ఆగస్టు 7న: రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు.

బీసీలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటానికి సిద్ధమైంది. ఈ కార్యాచరణ ద్వారా బీసీల రిజర్వేషన్ల బిల్లులు త్వరగా ఆమోదించబడతాయని పార్టీ ఆశిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *