టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస ఆఫర్లతో జోరుమీద ఉంది.ప్పటికే ఈ బ్యూటీ నటించిన ‘గుంటూరు కారం, సింగపూర్ సెలూన్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే తర్వాత సింగపూర్ సెలూన్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ రిలీజ్ అయ్యాయి. ఈ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన మీనాక్షి ఇప్పుడు లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ, మట్కా సినిమాలతో ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాల షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో కొత్త సినిమాలు ఓకే చే సేందుకు సిద్ధమైందట. అయితే తాజా అప్డేట్స్ ప్రకారం మీనాక్షి చౌదరి డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు చెప్పిన కథ విన్నారట. అది కాస్త నచ్చడంతో కోలీవుడ్ హీరో శింబుకు జోడీగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. శింబు-మీనాక్షి కాంబినేషన్ లో క్రేజీ లవ్ స్టోరీని ప్లాన్ చేశాడట అశ్వత్. కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో వస్తున్న ‘థగ్ లైఫ్’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు శింబు. ఆ సినిమా కొలిక్కి వచ్చిన వెంటనే తన సోలో సినిమా వివరాలు బయటపెడతాడు. ఇక చిరు హీరోగా చేస్తున్న విశ్వంభరలో కూడా మీనాక్షి ఓ రోల్ చేస్తోంది.
